భాజపాకు ఎందుకు ఓటెయ్యాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బీఎస్సార్ గార్డెన్‌లో ఆదివారం రాత్రి రజకల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు.
భాజపాకు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించుకోవాలని. పెట్రోల్ రూ.105 చేశారనా?, డీజిల్ రేటు పెంచారనా?, గ్యాస్ సిలిండర్ రూ.1000కి పెంచినందుకు ఓటెయ్యాలా? వంట నూనే రూ.150 చేశారనా? ఎందుకు ఓటేయ్యాలి? దేని కోసం వేయాలి. ఒక వ్యక్తి కోసం మనం ఎందుకు నష్టపోవాలి?. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా? లేక నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా?. ఇవాళ్టి నుంచి ఎన్నికలు ఎప్పుడైనా రాని. 15 రోజులకొస్తదా! నెలకొస్తదా!, రెండు నెలలకొస్తదా!.. ఈ నెల, రెండు నెలల మీ బాధ్యత, అవతలి రెండేళ్లు మా బాధ్యత. మీ ఫంక్షన్ హాలు పూర్తి చేయడం. సిద్దిపేటలో కట్టించినట్లు మోడ్రన్ దోబి ఘాట్ ఇక్కడ కట్టించడం. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. హుజూరాబాద్‌లో ఈనెల 26న మన ఫంక్షన్ హాలుకు శంకుస్థాపన చేద్దాం. ఆ రోజు మీరు ఇండ్లలో అందరు తాళాలు వేయాల. మొత్తం భార్య, పిల్లలతో అందరం అధికారికంగా.. ఆర్డీవోని పిలిచి, కలెక్టర్‌ను పిలిచి, అధికారికంగా మన చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకుందాం. ఫంక్షన్ హాలుకు కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించుకుందాం.