తెలంగాణ

telangana

ETV Bharat / city

'దసరాలోగా డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలి' - మంత్రి గంగుల రివ్యూ

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం దసరాలోగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్​ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణం, హరితహారం, పట్టణ ప్రగతిపై జిల్లా కలెక్టర్​తో సమీక్ష నిర్వహించారు.

'దసరాలోగా డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలి'
'దసరాలోగా డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలి'

By

Published : Jul 28, 2020, 5:35 AM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా.. దాదాపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఏవైనా అడ్డంకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. చాలా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి భూమి కొరత ఉందని.. కలెక్టర్​తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని గంగుల స్పష్టం చేశారు.

లక్ష్యాన్ని అధిగమించాలి..

ప్రభుత్వం చేపట్టిన ఆరో విడత హరితహారం.. ఆగస్టు మొదటివారంలోగా లక్ష్యాన్ని అధిగమించాలని గంగుల ఆదేశించారు. నగరంలో యాదాద్రి తరహాలో ఒక లక్షా 20వేల మొక్కలను 33 ఎకరాల్లో నాటుతున్నట్లు తెలిపారు. బ్లాక్ పద్దతిలో 21.50 ఎకరాల్లో 19,600 మొక్కలను నాటుతున్నామని వెల్లడించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ శశాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:సమస్య ఈటీవీకి చేరింది... వెంటనే రోగులకు సాయం అందింది

ABOUT THE AUTHOR

...view details