కరీంనగర్ జిల్లాలో హరితహారం ఒక ఉద్యమంలా చేపట్టాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హరితహారంపై కలెక్టరేట్లో నగర పాలక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న నగరాన్ని హరిత వనంగా మార్చేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. హరితహారానికి నిధుల కొరత లేదని, అవసరమైతే పట్టణప్రగతి, ఎల్ఆర్ఎస్, డీఎంఎఫ్టీ నిధులు ఉపయోగించుకోవాలని సూచించారు.
హరితహారం ఓ ఉద్యమంలా చేపట్టాలి: గంగుల
హరితహారం ఏర్పాట్లపై కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కాంక్రీట్ జంగల్‌గా ఉన్న నగరాన్ని హరితవనంగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
హరితహారం ఓ ఉద్యమంలా చేపట్టాలి: గంగుల
జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలు నాటి, 85 శాతం బ్రతికే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా సరిహద్దుల నుంచి జిల్లా కేంద్రం వరకు ఇరువైపులా 3 వరుసలు చెట్లు నాటి, సంరక్షించాలన్నారు. వీలైనంత వరకు 2 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను నాటాలని, జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ, ప్రభుత్వ స్థలాలు గుర్తించి ప్రజలకు ఉపయోగకరమైన మొక్కలు నాటాలన్నారు.
ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!