కొత్త వ్యవసాయ చట్టాలతో తగ్గిపోతున్న మార్కెట్ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతును రాజు చేసేందుకే రాష్ట్ర సర్కారు కృషి: గంగుల - మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అన్నదాత సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నమన్నారు.
![రైతును రాజు చేసేందుకే రాష్ట్ర సర్కారు కృషి: గంగుల రైతును రాజు చేసేందుకే రాష్ట్ర సర్కారు కృషి: గంగుల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9815253-537-9815253-1607490793349.jpg)
రైతును రాజు చేసేందుకే రాష్ట్ర సర్కారు కృషి: గంగుల
అన్నదాత సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నమన్నారు. మార్కెట్ పాలకవర్గంలో రిజర్వేషన్లు కల్పించడం వల్ల అన్ని వర్గాలకు, మహిళలకు కూడా ఛైర్మన్లు నియమించే అవకాశం లభించిందన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ నూతన ఛైర్పర్సన్ ఎలుక అనిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రైతులను నట్టేటా ముంచే చట్టాన్ని వాపస్ తీసుకోవాలి: ఈటల
TAGGED:
karimnagar latest news