తెలంగాణ

telangana

ETV Bharat / city

'బండి సంజయ్‌ది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష..' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

Gangula Kamalakar Comments: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్​ చేస్తుంది మౌన దీక్ష కాదని.. తెలంగాణ అభివృద్ధి చూడలేక చేస్తున్న ఈర్ష్య దీక్షగా మంత్రి అభివర్ణించారు.

Minister Gangula Kamalakar Comments on Bandi sanjay about Dharani portal
Minister Gangula Kamalakar Comments on Bandi sanjay about Dharani portal

By

Published : Jul 11, 2022, 4:42 PM IST

'బండి సంజయ్‌ది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష..'

Gangula Kamalakar Comments: ధరణితో 98 శాతం భూ సమస్యలు, భూతగాదాలు తగ్గిపోయాయని... మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. మిగిలిన కొద్దిపాటి సమస్యలు త్వరలో చేపట్టబోయే... రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్​ కరీంనగర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. బండి సంజయ్‌ది మౌనదీక్షకాదు... ఈర్శ్య దీక్ష అని మంత్రి విమర్శించారు. తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే.. ఇలాంటి దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడితే... తెరాస తరఫున తానే వస్తానని గంగుల తెలిపారు. మోదీ అనేక హామీలిచ్చి గాలికొదిలేశారన్న మంత్రి.. ధరల పెరుగుదల, ఉద్యోగాల కోసం దిల్లీలో కూర్చొని వాటిపై పోరాడాలని హితవు పలికారు. తెరాస పాలన, రాష్ట్రాభివృద్ధిని చూసి తట్టుకోలేకే... ఇలాంటి ఈర్శ్య దీక్షలు చేస్తున్నారని గంగుల కమలాకర్‌ ఎద్దేవా చేశారు.

"గతంలో వడ్లు కొంటామని మాట తప్పారు. ఇప్పుడు మీరు ముందస్తు ఎన్నికలకు వస్తామంటే ఎవరు నమ్ముతారు? ప్రధానితో ముందస్తు ఎన్నికల ప్రకటన చేయించాలి. ప్రధాని తేదీ ప్రకటిస్తే ముందస్తు ఎన్నికలకు సిద్ధమని సీఎం చెప్పారు. ధరణి వల్లే భూ సమస్యలు తగ్గాయి. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా?. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు.. ఇచ్చారా? గ్యాస్ ధర పెంచినందుకు ప్రతీ ఇంటిముందు కుర్చీ వేసి దీక్షచేద్దాం. పెట్రోలు, డీజిల్ ధరల పెంచినందుకు మౌనదీక్ష చేద్దాం. ప్రైవేటీకరణ ఆపాలని ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ ముందు దీక్ష చేస్తాం. బండి సంజయ్‌ది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష."- గంగుల కమలాకర్​, పౌరసరఫరాల శాఖ మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details