కరీంనగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ సునీల్ రావు పట్టణంలో పర్యటించారు. 42వ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో హరితహారం విజయవంతం చేయడానికి ప్రజలందరు సహకరించాలని కోరారు. మురుగు కాలువల నిర్మాణాలను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల తొలగింపుతో పాటు భవనాల పై ఉన్న హైటెన్షన్ వైర్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటీతో పాటు పారిశుద్ధ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని అధికారులను సూచించారు.
'పారిశుద్ధ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదిక'
కరీంనగర్ పట్టణంలోని తాగునీరు, పారిశుద్ధ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా 42వ డివిజన్ పర్యటించి.. పలు సూచనలు చేశారు.
ట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్