తెలంగాణ

telangana

ETV Bharat / city

'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది'

కరీంనగర్‌లోని సీఎస్​ఐ చర్చి వద్ద మంత్రి గంగుల కమలాకర్​ చేతుల మీదగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభత్వంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని గంగుల విజ్ఞప్తి చేశారు.

minister gangula
నిత్యావసర వస్తువుల పంపిణీ

By

Published : Apr 12, 2020, 1:15 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుందని, దాతలు కూడా ముందుకు రావాలని మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతోన్న వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లోని సీఎస్​ఐ చర్చి వద్ద పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరిస్తూ... స్వీయనియంత్రణ పాటించాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు.

కరీంనగర్​లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో గంగుల కమలాకర్​ కీలక పాత్ర పోషించారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కూడా గంగులను అభినందించినట్లు తెలిపారు. కరీంనగర్​ పోలీసుల చోరవతోనే ఇండోనేషియా వాసుల వివరాలు ముందుగా కేంద్రానికి తెలిపడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కరీంనగర్​ పోలీసు యంత్రాంగాన్ని వినోద్​ అభినందించారు. కార్యక్రమంలో కరీంనగర్​ మేయర్​, డిప్యూటి మేయర్​ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:చికెన్​ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది!

ABOUT THE AUTHOR

...view details