రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. పలువురు చర్చ్‌ల పాస్టర్లు, మంత్రి ఈటల రాజేందర్, కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకులు సతీశ్‌కుమార్‌తో కలిసి పేదలకు నిత్యావసరాలు అందజేశారు.
ఈ సీజన్‌లో రాష్ట్రంలో భూమికి బరువయ్యే పంటలు పండాయన్నారు. పండిన పంట మిల్లులకు తరలించే క్రమంలో అవగాహన లేని వారు రైతాంగాన్ని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కోతల పేరుతో బేరాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. రైతుల మీద ఆధారపడి మనం బతుకతున్నామని, రైస్ మిల్లుల మీద ఆధారపడి అన్నదాతలు బతుకరని స్పష్టం చేశారు.