కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మధ్యమానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తాగు,సాగు నీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. సిరిసిల్ల, వేములవాడ,చొప్పదండి నియోజకవర్గాలతో పాటు కరీంనగర్‌కు తాగునీరు అందించే దిగువమానేరుకు... మిషన్ భగీరథ పథకం ద్వారా నీరందిస్తారు. మొన్నటి వరకు 25టీఎంసీలతో జలాశయం కళకళలాడగా.. కేవలం నెలరోజుల్లోనే 15టీఎంసీలకు తగ్గిపోయింది.
ప్రత్యమ్నాయాలు చూసుకోవాలని సూచన..
యాసంగి పంటకోసం వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాలకు 11టీఎంసీల నీటిని నిరంతరాయంగా తరలించారు. ఒక్కసారిగా నీరు తగ్గిపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ముంపునకు గురైన 11 గ్రామాలకు సంబంధించిన పాత ఇళ్లు, వాటి అవశేషాలు, చెత్తచెదారం, మునిగిపోయిన చెట్లలో రసాయన చర్యలు వెరసి..... నీరు కలుషితంగా మారింది. అధికారులు గతనెల 30 నుంచి తాగునీటి సరఫరాను నిలిపివేసి ప్రత్యమ్నాయాలు చూసుకోవాలన్నారు. ప్రస్తుతం పాతపద్ధతుల ద్వారా నీరు అందిస్తుండగా.....జలాశయంలోని నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.