హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి మృతదేహాలకు అంత్యక్రియలు ముగిశాయి. గుంజపడగ గ్రామంలో గోదావరి తీరంలో వామన్రావు తమ్ముడు ఇంద్రశేఖర్ దహన సంస్కారాలు నిర్వహించారు. ఒకే చితిపై దంపతుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. భారీ బందోబస్తు నడుమ దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ముగిసిన వామన్రావు దంపతుల అంత్యక్రియలు - లాయర్ దంపతుల హత్య
హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి మృతదేహాలకు స్వగ్రామం గుంజపడుగులో అంత్యక్రియలు ముగిశాయి. భారీ బందోబస్తు నడుమ గోదావరి తీరంలో వామన్రావు దంపతులకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు గుంజపడుగు గ్రామాన్ని మోహరించారు.

ముగిసిన వామన్రావు దంపతుల అంత్యక్రియలు
అంత్యక్రియల్లో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం:న్యాయవాద దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Last Updated : Feb 18, 2021, 6:52 PM IST