దేశ రాజకీయాల్లో సత్తాచాటాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ నేడు కరీంనగర్లో ప్రచారాన్ని ప్రారభించనున్నారు. పట్టణంలోని లోయర్ మానేర్ డ్యాం సమీపంలోని స్పోర్ట్స్ పాఠశాల మైదానం...ఎన్నికల ప్రచారానికి వేదికైంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.
తెరాస శంఖారావానికి భారీ ఏర్పాట్లు - కరీంనగర్
తెరాస అధినేత కేసీఆర్ తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి ఇవాళ ప్రారంభించనున్నారు. సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
trs