ప్రజల్లో వచ్చిన అవగాహానతోనే... ఈ ఏడాది సీజనల్ వ్యాధులు తగ్గాయని కరీంనగర్ నగర మేయర్ వై.సునిల్ రావు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు నగరంలో ప్రతి ఆదివారం 10 గంటలు 10 నిమిషాల కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. నగరంలోని 3 వ డివిజన్ కిసాన్ నగర్లో పర్యటించిన మేయర్... కూలర్లు, డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాలు, మట్టి పాత్రల్లోని నీటిని తొలగించారు.
'ప్రజల్లో వచ్చిన అవగాహన వల్లే సీజన్ వ్యాధుల తగ్గుముఖం' - sanitation programs in karimnagar
ప్రతి ఆదివారం 10 గంటలు 10 నిమిషాల కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై. సునిల్ రావు పాల్గొన్నారు. పలు కాలనీల్లో పర్యటించిన మేయర్... కూలర్లు, డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాలు, మట్టి పాత్రల్లోని నీటిని తొలగించారు.
karimnagar mayor sunilrao participated in sanitation program
పలు ఇళ్లలో పర్యటించి... మహిళలకు, ఇంటి యజమానులకు వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. గతేడాదితో పోలిస్తే... ఈసారి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని మేయర్ స్పష్టం చేశారు. సీజన్ ముగిసేవరు నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఎడ్ల అశోక్, డివిజన్ వాసులు పాల్గొన్నారు.