దుబ్బాక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని కరీంనగర్ మేయర్ సునిల్‌రావు విమర్శించారు. ఒక మహిళపై అసత్యప్రచారాలు చేయడమే కాకుండా... ఫేక్ మీడియాతో గెలిచి సీఎం అనే మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
'బండి సంజయ్ నోటికి అడ్డూఅదుపు లేకుండా పోయింది' - klarimnagar latest news
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కరీంనగర్ మేయర్ సునిల్‌రావు మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు ఆపోలో ఆస్పత్రి సెంటిమెంట్‌గా మారిందని ఎద్దేవా చేశారు.
'బండి సంజయ్ నోటికి అడ్డూఅదుపు లేకుండా పోయింది'
మూడుసార్లు ఓడిపోయిన సానుభూతితో గెలిచిన విషయాన్ని పక్కన బెట్టి పూర్తిగా తానే గెలిపించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందిన బండిసంజయ్‌కు అపోలో ఆసుపత్రి అంటే సెంటిమెంట్‌గా మారిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే విధంగా నటించారని గుర్తు చేశారు. ఒక్క దుబ్బాక స్థానం గెలిచినంత మాత్రాన ఇంతగా ఎగిరిపడటం మంచిదికాదని హితవు పలికారు.
ఇదీ చూడండి: ముందు కెరీర్.. తర్వాతే పెళ్లంటున్న అమ్మాయిలు
Last Updated : Nov 14, 2020, 6:38 PM IST