తెలంగాణ

telangana

ETV Bharat / city

నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి

భారీగా కురుస్తున్న వర్షాలతో దిగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జలాశయ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా... ఇవాళ ఉదయానికి 21 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా... గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే యోచనలో అధికారులు ఉన్నారు.

karimnagar lmd filled full of water
నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి

By

Published : Aug 21, 2020, 6:45 PM IST

కరీంనగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువ మానేరు జలాశయంలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. తిమ్మాపూర్ మండలంలోని దిగువ మానేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా... ఈరోజు ఉదయానికి 21 టీఎంసీలకు చేరింది. జలాశయం గేట్లు ఎత్తుతున్నారనే సమాచారంతో గురువారం మానేరు తీరంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఏడాది నుంచి పూర్తిస్థాయిలో నిండని జలాశయం ఒకేసారి నిండుకుండలా మారడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

వర్షాల ప్రారంభంలో మోయ తుమ్మెద వాగు నుంచి ఎల్ఎంఎండీకి 60 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా... కొంత తగ్గుముఖం పట్టటం వల్ల 2 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా... ఇన్​ఫ్లో 30 వేల క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం నీటిమట్టం క్రమంగా పెరగ్గా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి
నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి

ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'

ABOUT THE AUTHOR

...view details