కరీంనగర్‌లో ప్రమాదకర జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్ శశాంక ఆదేశించారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంగళవారం 1500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ వాసులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అత్యవసర సేవల కోసం మాత్రమే ప్రజలకు అనుమతి ఇస్తున్నట్లు కలెక్టర్ శశాంక వెల్లడించారు. అనవసరంగా బయటకు వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిత్యవసర సరుకులు విక్రయించే కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని సూచించారు.
కొంతమందికి కరీంనగర్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామన్న కలెక్టర్.. కరోనా అనుమానితులను 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు.