ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన మత ప్రచారకులతో కలిసి తిరిగిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించామని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. మత ప్రచారకులకు కరోనా వైరస్ ఉండడం వలనే కరీంనగర్ వ్యక్తికి కూడా సోకిందన్నారు కలెక్టర్. కరోనా సోకిన వ్యక్తి ఇప్పటి వరకు కలిసిన వారు, ఇండోనేషియా మత ప్రచారకులతో సన్నిహితంగా ఉన్న వారు కూడా కచ్చితంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కోవిడ్ రిసెప్షన్ సెంటర్ వద్ద పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ - Karimnagar Collector Checkup In District Center
కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులో కలెక్టర్, పోలీస్ కమిషనర్ల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కరోనా అనుమానితులను అదుపులో తీసుకొని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్
కరీంనగర్ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని కలెక్టర్ కోరారు. పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్స్ వాడాలని సూచించారు. ఈ నెల 31 వరకు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని కలెక్టర్ కోరారు.
ఇదీ చూడండి : కరోనాపై భారత్ సమరం- లాక్డౌన్లో పలు రాష్ట్రాలు