తెలంగాణ

telangana

ETV Bharat / city

కాలుష్య కోరల్లో నగర వాసులు - డంపు యార్డు కాలుష్యం

కరీంనగర్ నగర వాసులను.. కొవిడ్​తో పాటు కాలుష్య సమస్య వేధిస్తోంది. శివారులోని డంపు యార్డులో భారీగా పేరుకుపోయి ఉన్న చెత్తకు.. పారిశుద్ధ్య కార్మికులు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

dump yard pollution
డంపు యార్డు కాలుష్యం

By

Published : May 10, 2021, 1:49 PM IST

ఓ వైపు కొవిడ్​ వైరస్​తో పోరాడుతుంటే.. తమ ప్రాంతంలో నగరపాలక సంస్థ కాలుష్యాన్ని పెంచుతోందంటూ కరీంనగర్ నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న సమస్యలతోనే తట్టుకోలేక పోతుంటే.. డంప్​ యార్డ్​ కారణంగా ఉత్పన్నమవుతోన్న పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.

పాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి నగరంలోని డంప్​ యార్డ్​లో సమకూర్చారు. చెత్త భారీగా పేరుకుపోవడంతో.. పారిశుద్ధ్య కార్మికులు ఆ కుప్పకు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించడంతో.. ఆటోనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లక్ష్మీ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి.. కాలుష్యం నుంచి కాపాడాలని వేడుకున్నారు.

వేధిస్తోన్న కాలుష్య సమస్య..

ఇదీ చదవండి:ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

ABOUT THE AUTHOR

...view details