శాసనమండలి పట్టభద్రుల అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారిని పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్ట భద్రుల మద్దతుతో గెలిచి ప్రజా సమస్యలను శాసనమండలిలో వినిపించి ప్రభుత్వం స్పందించేలా చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజా గొంతుక వినిపిస్తా - అంబేడ్కర్ స్టేడియం
మండలి ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపిస్తే ఒక సంఖ్య పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. అదే తనను గెలిపిస్తే మండలిలో ప్రజా గొంతుకను వినిపిస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి