ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఐదేళ్ల తెరాస పాలనలో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్రంలో ఇంకా 25 శాతం మంది రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వలేదని ఆరోపించారు. జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ చాలా తప్పులున్నట్లు తెలిపారు. ఇన్ని లోపాలుంటే భూప్రక్షాళన బాగా చేశారని రెవెన్యూ సిబ్బందిని సీఎం ఎలా మెచ్చుకుంటారని ప్రశ్నించారు. రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్‌గా కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అవినీతిపై ప్రజలు ప్రశ్నిస్తారని గ్రహించిన సీఎం తన తప్పును ఉద్యోగులపై నెడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ లంచం తీసుకొమ్మని చెప్పారని సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం పాలనా విధానం, ఆలోచనా విధానంలో మార్పు రావాలని చురకలు వేశారు.
రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారు - undefined
ఐదేళ్ల పాలన తర్వాత కేసీఆర్‌కు అవినీతి గుర్తోచ్చిందా అని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో భూప్రక్షాళన సరిగ్గా జరగలేదని ఆరోపించారు. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదన్నారు. పాలనా విధానంలో మార్పు రావాలని సూచించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి..