కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా మత ప్రచారకులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎవరెవరిని కలిశారు, రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్‌కు ఎలా చేరుకున్నారన్న దానిపై సీసీ ఫుటేజీ వివరాలు సేకరిస్తున్నారు.
ఇండోనేషియా ప్రచారకుల వివరాల సేకరణలో రామగుండం పోలీసులు - ఇండోనేషియా మతప్రచారకుల సమాచార సేకరణ
ఇండోనేషియా మత ప్రచారకులకు సంబంధించిన సీసీ ఫుటేజీ వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. వారు రామగుండం రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఇండోనేషియా మత ప్రచారకుల వివరాల సేకరణ
రైల్వే స్టేషన్ సమీపంలోని మదర్సాలోకి వెళ్లారా? మదర్సా వ్యక్తులే వచ్చి మత ప్రచారకులను కలిశాలా? అని ఆరా తీస్తున్నారు. రామగుండం రైల్వే స్టేషన్‌కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సమాచారం వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. అంతే కాకుండా మరో నాలుగైదు రోజుల పాటు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు నడపవద్దని పోలీసులు సూచించారు.
ఇండోనేషియా మత ప్రచారకుల వివరాల సేకరణ
ఇదీ చూడండి:నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు