అలోపతి వైద్యంతో ఉపశమనం పొందని వ్యక్తులు భూమి మీద ఎవరూ లేరని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి విజేందర్‌రెడ్డి అన్నారు. అలోపతి వైద్యులపై హోమియోపతి వైద్యుడు బసవ ఆనందం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ రంగంలో మంచి భవిష్యత్‌ను ఏర్పరుచుకోబోయే విద్యార్థులు ఇలాంటి పిచ్చి మాటలతో సందిగ్ధతకు గురవుతారన్నారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
హోమియోపతి వైద్యుడి వ్యాఖ్యలను ఖండించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు
అలోపతి వైద్యులపై హోమియోపతి వైద్యుల వ్యాఖ్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి విజేందర్‌రెడ్డి ఖండించారు. ఈ రంగంలో మంచి భవిష్యత్‌ను ఏర్పరచుకోబోయే విద్యార్థులు ఇలాంటి పిచ్చి మాటలతో సందిగ్ధతకు గురవుతారని.. తేలికగా తీసుకోవాలని ఆయన సూచించారు.
హోమియోపతి వైద్యుడి వ్యాఖ్యలను ఖండించిన ఐఎంఏ అధ్యక్షుడు
విషయ పరిజ్ఞానంలేని హోమియోపతి వైద్యుడు బసవ ఆనందం.. అలోపతి వైద్యులపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, మెడికల్ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంటర్వ్యూ చూసిన వైద్య విద్యార్థులు తేలికగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్