హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్(Huzurabad congress candidate Venkat) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ వెంట.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉండనున్నారు. ఆయన తరఫున కొల్లూరి కిరణ్ గురువారం రోజున హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఒక సెట్ నామపత్రాలు సమర్పించారు.
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరిపై 24 కేసులు..
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ (వెంకటనర్సింగరావు(Huzurabad congress candidate Venkat))పై మొత్తం 24 కేసులున్నాయి. ఈ మేరకు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయన తరఫున కొల్లూరి కిరణ్ గురువారం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్‌తోపాటు ఆయన తల్లి పద్మ ఆస్తిపాస్తుల వివరాల్ని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. తల్లి మెడికల్, ఫార్మసీ వ్యాపారం నిర్వహిస్తున్నారని, తాను ఫిట్‌నెస్ జిమ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, ధర్నాల సందర్భంగా మొత్తం 24 కేసులు వివిధ ఠాణాల్లో నమోదయ్యాయని తెలిపారు.