Honey Bees Attack on Audience: థియేటర్‌లో సినిమా చూడడానికి వెళ్లిన ప్రేక్షకులపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. అక్కన్నపేట రోడ్డులో ఉన్న వెంకటేశ్వర ఏసీ థియేటర్‌లో కేజీఎఫ్-2 సినిమా చూడటానికి వచ్చిన వారు టికెట్లు తీసుకుంటుండగా ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు కాగా.... వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో... మెరుగైన చికిత్సకు కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మూవీ కోసం థియేటర్‌కి వెళ్లారు... ఆసుపత్రికి పరుగులు తీశారు - తేనెటీగల దాడి
Honey Bees Attack on Audience: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులపై తేనెటీగలు దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
Honey Bees Attack