Holi celebrations in karimnagar: కరీంనగర్లో జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహభరిత వాతావరణంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ సీపీ శ్రీనివాస్ పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకున్నారు.
అంబరాన్నంటిన హోలీ సంబురాలు.. పాల్గొన్న మంత్రి, కలెక్టర్, సీపీ.. - కలెక్టర్ కర్ణన్ తాజా వార్తలు
Holi celebrations in karimnagar: కరీంనగర్ జిల్లాలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సంబురాల్లో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సిబ్బందితో కలిసి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
హోలీ వేడుకలు
మంత్రి గంగుల, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించని రంగులను వాడాలని.. సుఖ సంతోషాలతో సంబురాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే హోలీ ధూంధాం.. కార్యకర్తలకు మందు.. విందు.. చిందు..