తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండు గంటల భారీ వర్షం.. ఇళ్లలోకి చేరిన నీరు! - telangana news

రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. మురుగుకాలువలు పొంగి.. ఆ నీరు ఇళ్లలోకి చేరింది. ఇళ్లలో చేరిన నీరుని తొలగించడానికి స్థానికులు నానా అవస్థలు పడ్డారు. కేవలం రెండు గంటల వానకే పరిస్థితి ఇలా ఉంటే.. రాను రాను ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.

Heavy rain in Ramagundam industrial area of Peddapalli district
భారీ వర్షానికి ఇళ్లలోకి చేరిన నీరు

By

Published : Jun 26, 2021, 6:03 PM IST

Updated : Jun 26, 2021, 8:29 PM IST

రెండు గంటల భారీ వర్షం.. ఇళ్లలోకి చేరిన నీరు!

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో.. సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం వల్ల ప్రధాన రహదారులు నీటిలో మునిగిపోయాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో భారీ వర్షానికి మురుగు కాలువలు పొంగిపొర్లి ఇళ్లలోకి చేరాయి.

సామగ్రి పూర్తిగా నీటిలో..

47వ డివిజన్​లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో సామగ్రి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వర్షపు నీరు ఇళ్లలోంచి బయటకు పంపించేందుకు కాలనీవాసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఒకరోజు వర్షానికే.. ప్రధాన రహదారులతో పాటు ఆయా డివిజన్లలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వర్షం నీరు ఇళ్లలో చేరకుండా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. వర్షాకాలంలో తగిన చర్యలు చేపట్టకపోవడంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరిందని కాలనీవాసులు అధికారులపై మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: Rains: తెలంగాణలో రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు

Last Updated : Jun 26, 2021, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details