సమీపంలోనే కృష్ణా, గోదావరి జలాలు ఉన్నప్పటికీ... 72 ఏళ్లుగా స్వచ్ఛమైన తాగునీటికి మనం నోచుకోలేదని మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ఆ కష్టాలను దూరం చేసిందన్నారు. కాళేశ్వరంపై చేస్తున్న ఖర్చును విపక్షాలు తప్పుపడుతున్నాయని... డబ్బు గురించి ఆలోచించవద్దని, ప్రజలకు జరుగుతున్న మేలు చూడాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికం కంటే... ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని తెవిపారు.
కరోనా విషయంలో ప్రతిపక్షాలది అనవసరపు రాద్దాంతం: ఈటల - మిషన్ భాగీరథపై మంత్రి ఈటల రాజేంద్ర్ వ్యాఖ్యలు
ఎన్నో ఏళ్ల తాగునీటి కష్టాలు మిషన్ భగీరథతో దూరమయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కృష్ణా, గోదావరి నదులు సమీపంలోనే ప్రవహిస్తున్నా... స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఈటల విమర్శించారు. పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలనే అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త వైరస్ కాబట్టి ఒక్కో ప్రాంతంలో, ఒక్కో మనిషిలో ఒక్కో విధంగా ఉంటుంది... అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నింటినీ పాటించామని తెలిపారు. వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సకు మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. 22 వైద్య కళాశాలల్లో కలిపి 15వేలకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:లాకప్‌డెత్ కేసుపై సీబీఐ దర్యాప్తు షురూ