సోమవారం రాత్రి నుంచి దీక్ష చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పార్టీ నాయకులు వైద్యులతో పరీక్షలు జరిపించారు. షుగర్ లెవల్స్ 70కి పడిపోయినట్టు తెలిపారు. ప్రస్తుతం సంజయ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం కావాలనే సంజయ్ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కమలం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు.. క్షీణిస్తున్న ఆరోగ్యం - బండి సంజయ్ ఆరోగ్యం వార్తలు
బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు పార్టీ నేతలు తెలిపారు. షుగర్ లెవల్స్ 70కి పడిపోయినట్టు వివరించారు.
దుబ్బాక ఎన్నికల భాజపా అభ్యర్థి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించినందున... సిద్దిపేట వెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు... సిద్దిపేట శివారులోనే అదుపులోకి తీసుకొని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తనపై సిద్దిపేట సీపీ చేయి చేసుకున్నారని సంజయ్ ఆరోపిస్తున్నారు. సీపీని వెంటనే సస్పెండ్ చేసి, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. మద్ధతుగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా శ్రేణులు ఆందోళనలు చేశారు.
ఇదీ చూడండి:కొనసాగుతున్న బండి సంజయ్ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన