ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రజలు ధైర్యంగా ఇంట్లోనే ఉండాలి. వైరస్ నియంత్రణలో మీడియా పాత్ర చాలా గొప్పది. లాక్డౌన్తో పనిలేక చాలా మంది దినసరి కూలీలకు ఉపాధి కరువైంది. వారికి 12 కిలోల బియ్యం పంపిణీ చేపట్టాం. త్వరలోనే బియ్యం పంపిణీ పూర్తి చేస్తాం. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1100 కోట్లు కేటాయించింది. వరి పంటను కొనుగోలు చేసేందుకు కూడా అన్ని చర్యలు చేపట్టాం :-మంత్రి గంగుల కమలాకర్
'ప్రజలు సహకరిస్తే వైరస్ ప్రభలకుండా చూడొచ్చు' - minister gangula kamalakar
కరీంనగర్లో ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో 10 మందితో పాటు, ఓ కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వీరితో కలిసిన వారందరిని క్వారంటైన్ చేశామన్నారు. ఎక్కడికక్కడ అనుమానితులను కట్టడి చేశామన్నారు. ప్రజలు సహకరిస్తే వైరస్ ప్రభలకుండా చూసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు.
'ప్రజలు సహకరిస్తే వైరస్ ప్రభలకుండా చూడొచ్చు'