తెలంగాణ

telangana

ETV Bharat / city

జీతం ఇవ్వడం లేదని అధ్యాపకురాలి ఆందోళన - కరీంనగర్​లో అతిథి అధ్యాపకురాలి ఆందోళన

తనకు జీతం ఇవ్వటం లేదంటూ ఓ అధ్యాపకురాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేతం వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది.

guest faculty dharna at karimnager govt college
అధ్యాపకురాలి ఆందోళన

By

Published : Mar 4, 2020, 10:34 PM IST

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో.. మునిగంటి రాణి అర్ధశాస్త్ర విభాగంలో అతిథి అధ్యాపకురాలిగా పని చేస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వటం లేదంటూ ఆమె ఆరోపిస్తోంది. ఒక పీరియడ్‌కు 280 రూపాయలుండగా, కేవలం 65 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాల ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్​ చేసింది. సమాచారం అందుకున్న జడ్పీటీసీ శ్రీరాంశ్యాం కళాశాలకు చేరుకొని రాణితో మాట్లాడారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వగా ఆందోళన విరమించింది.

పీజీలో అతిథి అధ్యాపకురాలిగా 2016 నుంచి చేస్తున్నట్లు రాణి తెలిపారు. ఈ మార్చి వరకు తనకు కళాశాల నుంచి రూ.6 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఇప్పుడు డబ్బులు అడిగితే పాత ప్రిన్సిపల్‌, నూతన ప్రిన్సిపల్‌ ఇద్దరు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కుటుంబ పోషణ భారంతో తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.

అధ్యాపకురాలి ఆందోళన

ఇవీ చూడండి:కరోనా వ్యాప్తి, నివారణ, సంసిద్ధతపై పీఎంఓ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details