తెలంగాణ

telangana

ETV Bharat / city

అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల

హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సాగర్​లో లాగా ఇక్కడ గెలవాలని చూస్తే ప్రజలు పాతేస్తారని తేల్చి చెప్పారు. ఎన్నికలు వస్తే ప్రజలంతా అండగా ఉంటారని స్పష్టం చేశారు. హుజూరాబాద్​ ప్రజలు సహనం కోల్పోవద్దని సూచించారు. పద్ధతులు మార్చుకోకపోతే కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

etela rajender, etela fires on kcr
ఈటల రాజేందర్, హుజూరాబాద్​లో ఈటల

By

Published : May 18, 2021, 11:37 AM IST

Updated : May 18, 2021, 12:33 PM IST

తనను వేధిస్తే పర్వాలేదు కానీ.. ప్రజలను వేధించొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇంఛార్జ్​నని చెప్పుకుంటున్న నేతలు ప్రజలను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించమని సర్పంచులను, ఎంపీపీ, ఎంపీటీసీలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, హుజూరాబాద్ ప్రజలు ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని అన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్

ఎవరూ వెయ్యేళ్లు బతికలేరన్న ఈటల.. అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లేనని పేర్కొన్నారు. 2023 తర్వాత అధికారంలో ఉండరని, 20 ఏళ్లుగా కుటుంబసభ్యుల్లా ఉన్న ప్రజలను వేరుచేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు.

సాగర్​లో లాగా హుజూరాబాద్​లో గెలవాలని చూస్తే ప్రజలు పాతేస్తారని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. ఎన్నికలు వస్తే ప్రజలంతా అండగా ఉంటారని స్పష్టం చేశారు. హుజూరాబాద్​ ప్రజలు సహనం కోల్పోవద్దని సూచించారు. పద్ధతులు మార్చుకోకపోతే కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Last Updated : May 18, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details