Forest Land Issue: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో అటవీశాఖ అధికారులు, గ్రామస్థుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. ఆ గ్రామంలో రెండేళ్ల క్రితం అటవీశాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత భూముల్లో వ్యవసాయ పనులు కానీ.. అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే ప్రక్రియనూ చేపట్టలేదు. దీంతో త్వరలో తమకు ప్రభుత్వం పట్టాలిస్తుందన్న ఆశలో గ్రామస్థులు ఉన్నారు.
భూమిస్తారనుకున్నారు.. కానీ అధికారులు జేసీబీలతో తరలివచ్చారు.! - అటవీ భూమి సమస్య
Forest Land Issue: గ్రామస్థులకు.. అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వివాదంగా మారిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు జేసీబీలతో తరలివచ్చి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే వివాదానికి కారణమైంది.
![భూమిస్తారనుకున్నారు.. కానీ అధికారులు జేసీబీలతో తరలివచ్చారు.! Forest Land Issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14947884-786-14947884-1649262913836.jpg)
హఠాత్తుగా అటవీశాఖ అధికారులు జేసీబీలతో తరలివచ్చి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో అడవి పదిర గ్రామస్థులు ఆశ్చర్యానికి గురై ఆ పనులను అడ్డుకున్నారు. 2011కు ముందు ఆక్రమణకు గురైన 20హెక్టార్లలో మాత్రమే మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టనున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దీనికి గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. ఒకవేళ మొక్కలు నాటాలనుకుంటే 2005 తర్వాత ఆక్రమించుకున్న భూములన్నింటిలోనూ చేపట్టాలని.. లేని పక్షంలో అసలు మొక్కలు నాటనివ్వబోమని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకోగా అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఇదీ చదవండి:మిరపకాయలతో డీహెచ్ శ్రీనివాసరావు హోమం... ఇంతకీ ఆయనేమన్నారంటే?