రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్లో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో రెండు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే దుమ్మాటి రాజేశం (60)పై పలువురు హత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా రాజేశం మృతి చెందాడు.
పంచనామా అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. హత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా.. పీడీ యాక్ట్ నమోదుచేసి ఊరి నుండి బహిష్కరిస్తామని సీఐ సర్వర్ హామీ ఇచ్చారు. అనంతరం డీఎస్పీ స్థాయి అధికారి బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు.