సివిల్స్ ర్యాంకర్‌తో లక్ష్మిపవన్ గాయత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
పకడ్బందీ ప్రణాళిక.. గురి తప్పని లక్ష్యంతో సివిల్స్ ర్యాంక్ - upsc results
అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో సివిల్స్‌కు సిద్దమవ్వడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని కరీంనగర్ కు చెందిన లక్ష్మిపవన గాయత్రి అన్నారు. తాను కోచింగ్‌కు వెళ్లకుండానే పట్టుదలతో 427వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక.. గురి తప్పని లక్ష్యంతో ముందుకు వెళితే తప్పకుండా ఎవరైనా సివిల్స్ సాధించవచ్చని చెబుతున్నారు.ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రానిక్స్ చేస్తున్న క్రమంలోనే సామాజిక సేవ చేసేందుకు అవకాశం ఉన్నసివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి వైద్య వృత్తిలో ఉంటూనే తనకు మాత్రం సంపూర్ణ సహకారం అందించారంటున్న లక్ష్మిపవన్ గాయత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

పకడ్బందీ ప్రణాళిక.. గురి తప్పని లక్ష్యంతో సివిల్స్ ర్యాంక్