EX MLA vijaya ramanarao arrest: ఇసుక అక్రమ రవాణా విషయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అరెస్టయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనితో ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు మధ్య జరుగుతున్న విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇరు వర్గాల మధ్య బాహ్యంగానే గొడవలు జరుగుతుండేవి.
పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు వాగుపై ఇటీవల ఇసుక రీచ్లు ప్రారంభమయ్యాయి. కాగా ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దమ్ముంటే ఇసుక రీచ్ యజమానుల వద్ద డబ్బులు తీసుకోలేదని మల్లికార్జున స్వామి వద్ద ప్రమాణం చేయాలంటూ సవాలు విసిరారు.