తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్ డిమాండ్ ఢమాల్.. 4,300 మెగావాట్స్​కు తగ్గిన వినియోగం - తెలంగాణ వాతవరణ వివరాలు

ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. 12 వేల మెగావాట్ల నుంచి 4,300 మెగావాట్లకు వాడకం తగ్గింది. ఫలితంగా వోల్టేజ్​ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు.

వానదెబ్బ:12 వేల నుంచి 4,300 మెగావాట్స్​కు తగ్గిన వినియోగం
వానదెబ్బ:12 వేల నుంచి 4,300 మెగావాట్స్​కు తగ్గిన వినియోగం

By

Published : Oct 13, 2020, 10:28 AM IST

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పడిపోయి.. వోల్టేజ్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు విద్యుత్ శాఖ గుర్తించింది. విద్యుత్ అధికారులు, ఇంజనీర్లను అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సూచించారు. రాష్ట్రంలో 12 వేల మెగావాట్స్ నుంచి 4,300 మెగావాట్స్​కు డిమాండ్ పడిపోయిందని తెలిపిన ఆయన.. థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్​డౌన్ చేశామని తెలిపారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే 1912కు ఫోన్‌ చేసి సమాచారామివ్వాలని ప్రభాకర్‌ రావు కోరారు

ఇవీ చూడండి:తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం.. నాలుగైదు గంటలు వర్షగండం

ABOUT THE AUTHOR

...view details