తెలంగాణ

telangana

ETV Bharat / city

Huzurabad constituency Voters : ఓటు మీట.. భవిష్యత్​కు బాట - Huzurabad constituency Voters

ఏ నియోజకవర్గ భవిష్యత్​ అయినా అక్కడి ఓటర్ల(Huzurabad constituency Voters) పైనే ఆధారపడి ఉంటుంది. ఓటర్లు తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఎంత సద్వినియోగపరుచుకుంటే.. తమ భవిత అంత బాగా ఉంటుంది. హుజూరాబాద్​ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అభ్యర్థుల గెలుపు ఓటర్ల చేతిలో ఉంది. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ భవిష్యత్​కు బంగారు బాటలు వేసే అభ్యర్థిని ఎన్నుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వారిలో చైతన్యం తీసుకొస్తున్నారు.

Huzurabad constituency Voters
Huzurabad constituency Voters

By

Published : Oct 18, 2021, 12:13 PM IST

‘ఓటు మీట భవిష్యత్తుకు బాట’ అనేలా హుజూరాబాద్‌(Huzurabad By Election 2021)లో అర్హులైన ఓటర్లందరూ ఆయా పోలింగ్‌ కేంద్రాలకు కదిలేలా జిల్లా యంత్రాంగం తగు చర్యలను తీసుకుంటోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈసారి జరిగే ఉప ఎనికల్లో(Huzurabad By Election 2021) పోలింగ్‌ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఓటు విలువను అందరికీ తెలియజేసేందుకు అధికారులు తగిన ప్రయత్నాలను చేస్తున్నారు. పైగా చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్న ఇక్కడి నియోజకవర్గంలోని(Huzurabad By Election 2021) అన్నివర్గాల ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ హక్కును వినియోగించుకునేలా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు.

ఓటింగ్‌ శాతం పెరిగేలా..

ఈ ఉప ఎన్నికల్లో(Huzurabad By Election 2021) ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచాలనే సంకల్పాన్ని అధికారులు చేతల్లో చూపించబోతున్నారు. 2018 ఎన్నికల్లో 84.40 శాతం పోలింగ్‌(Huzurabad By Election polling) కాగా ఈసారి దాదాపుగా 90శాతానికిపైగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ హక్కును వినియోగించుకునేలా అవగాహన పెంచుతున్నారు. మరోవైపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సరైన వసతులను కల్పిస్తున్నారు. దివ్యాంగులతోపాటు వృద్ధులకు అవసరమైన సదుపాయాల్ని కల్పించేందుకు ఏర్పాట్లను చేపడుతున్నారు. ఇక గత మూడేళ్లతో పోలిస్తే నియోజకవర్గంలో ఓటర్ల(Huzurabad constituency Voters) సంఖ్య భారీగానే పెరిగింది. ఏకంగా 27,540 ఓట్లు పెరిగాయి. ఇటీవల ఎన్నికల అధికారులు ఈ ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల(Huzurabad constituency Voters) తుదిజాబితాను సిద్ధం చేశారు. ఒకటిరెండు రోజుల్లో ఆయా గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను ప్రజలు చూసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details