ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

భారీ వర్షాలు, వరదలతో విద్యుత్ రంగానికి కోట్లలో నష్టం - గోదావరి వరదలతో విద్యుత్​కి తీవ్ర నష్టం

Floods Effect on Electricity Sector: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... విద్యుత్ రంగానికి ఎనలేని నష్టం జరిగింది. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని గోదావరి తీర ప్రాంతంలో తీవ్రత ఎక్కువగా ఉంది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పొలాల్లో ఇసుకమేటలు వేసింది. పరికరాలు అందుబాటులో ఉన్నంతవరకు.. అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.

Floods Effect on Electricity
Floods Effect on Electricity
author img

By

Published : Jul 20, 2022, 1:27 PM IST

Floods Effect on Electricity Sector: ఎడతెరిపిలేని వానలు, కనివినీ ఎరుగని వరదలతో... గోదావరి తీర ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థను కుప్పకూల్చింది. జగిత్యాల జిల్లాలోని గోదావరి ఒడ్డుకు ఉన్న గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు ధ్వంసమయ్యాయి. ధర్మపురి మండలంలో ఆరెపల్లి, దొంతాపూర్‌, మగ్గిడి, జైన... రాజారం, ధమ్మన్నపేట, ధర్మపురి, తిమ్మాపూర్‌, రామయ్యపల్లె, రాయపట్నంలో... పొలాల్లోని విద్యుత్‌ మోటర్లు కొట్టుకుపోగా... మరికొన్ని పనికిరాకుండా పోయాయి. వెల్గటూరు, ధర్మపురి మండలాల్లో తీరని నష్టం కలిగింది. సుమారు 4 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ వ్యవస్థ కూప్పకూలడంతో... రైతులు వరి సాగు చేయలేని దుస్థితి నెలకొంది.

పెద్దపల్లి జిల్లాలోనూ విద్యుత్‌ రంగానికి భారీ నష్టం చోటు చేసుకొంది. చాలావరకు పొలాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. మంథనితోపాటు, ఎక్లాస్పూర్, కాల్వ శ్రీరాంపూర్, పొత్కపల్లి ప్రాంతాల్లో... ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే సామగ్రి సరఫరా చేసి.. మరమ్మతులు చేపడితే తప్ప.. కరెంటు సమస్య కొలిక్కి వచ్చే అవకాశం లేదంటున్నారు. ధర్మపురితోపాటు.. మంథని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి అదనపు సిబ్బందిని... తరలించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details