పెండింగ్లో ఉన్న దివ్యాంగుల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని దివ్యాంగుల సంఘం డిమాండ్ చేసింది. ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. డిగ్రీలు, పీజీలు చదువుకొని ఉద్యోగాలు లేకపోవడంతో దివ్యాంగులు అర్ధాకలితో జీవనం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 44 ఏళ్లు దాటుతున్నా తమకు ఉద్యోగాలు లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.
'దివ్యాంగుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి' - కరీంనగర్ లేటెస్ట్ న్యూస్
డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి దిగారు.
'దివ్యాంగుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి'
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల కోటాలోని ఉద్యోగాలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.