కరోనా మహమ్మారి ప్రభావం రాఖీపౌర్ణమిపై పడింది. సోదర సోదరీమణులకు అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ నేపథ్యంలో... కరీంనగర్ టవర్ సర్కిల్ వారం రోజుల ముందు నుంచి కొనుగోలుదారులతో కిటకిట లాడేది. ప్రస్తుత పరిస్థితులతో వ్యాపార సముదాయాలు వెలవెలబోతున్నాయి.
రాఖీపౌర్ణమిపై కరోనా ప్రభావం... వెలవెలబోతున్న మార్కెట్లు - covid effect
రాఖీపౌర్ణమిపై కొవిడ్ ప్రభావం భారీగా పడుతోంది. ఇప్పటికే మహిళలతో కిటకిటలాడాల్సిన కరీంనగర్‌లోని వ్యాపార సముదాయాలు... కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వెలవెలబోతున్నాయి. సోదరులకు రాఖీలు కొనడానికి బయటికివచ్చేందుకు సోదరీమణులు జంకుతున్నారు.
corona impact on rakhi pournami festival in karimnagar
రాఖీలను ఖరీదు చేసేందుకు మహిళలు సైతం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో రాఖీల వ్యాపారంపై ఆధారపడ్డ సీజనల్ వ్యాపారస్థులు లబోదిబోమంటున్నారు. గతంలో మిగిలిపోయిన స్టాక్‌తో పాటు ఈ ఏడాది కొత్తగా కొనుగోలు చేసిన రాఖీలు అమ్ముడు పోయే పరిస్థితి కనబడడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.