కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్నదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్... మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పొన్నం తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు జీవించి... ప్రజలకు సేవలు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. వేడుకల్లో భాగంగా 750 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా చీరల పంపిణీ - sonia gandhi birthday celebrations in karimnagar
కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్... 750 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
![సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా చీరల పంపిణీ congress leader distributed sarees in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9815733-166-9815733-1607493562730.jpg)
congress leader distributed sarees in karimnagar
సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి పొన్నం ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.