ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణానికి నిదర్శనంగా భావిస్తారని పాలనాధికారి శశాంక అన్నారు. కరీంనగర్ రెండో డిపోలో 36 మంది ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను కలెక్టర్ సన్మానించారు.
ఉత్తమ డ్రైవర్లకు కలెక్టర్ శశాంక సన్మానం - కరీంనగర్‌లో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ల సన్మాన కార్యక్రమం
కరీంనగర్ రెండో డిపోలో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాలనాధికారి శశాంక హాజరయ్యారు. డ్రైవర్లకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.
![ఉత్తమ డ్రైవర్లకు కలెక్టర్ శశాంక సన్మానం Collector Shashanka honors best drivers in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10674343-1014-10674343-1613635704048.jpg)
ఉత్తమ డ్రైవర్లను సన్మానించిన కలెక్టర్ శశాంక
వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీపై ప్రజలకు మరింత నమ్మకం పెరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్'గా హైదరాబాద్