రోడ్లు, మార్కెట్లు, మున్సిపాలిటీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నాం. మొక్కలు నాటేటప్పుడు చూపే శ్రద్ధ, వాటిని పెంచడంలో కూడా చూపాలి. చెట్ల సంరక్షణలో అధికారుల పాత్ర కీలకం. ఎవరైనా మొక్కలు తొలగించినా, విరగ్గొట్టినా జరిమానాతో పాటు, కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. - రవి జగిత్యాల కలెక్టర్
హరితహారంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలి' - జగిత్యాల కలెక్టర్ వార్తలు
ఆరో విడత హరితహారంలో నాటిన ప్రతి మొక్క ఏపుగా పెరిగేలా అందరు దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. జిల్లాలో అత్యధిక మొక్కలు నాటి.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ప్రజలందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
korutla harithaharam program
కోరుట్ల నియోజకవర్గ సరిహద్దు వరకు, ప్రతి రొడ్డు పక్కన మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తెలిపారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:
ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలి: హోంమంత్రి