తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR: ప్రభుత్వ కాంట్రాక్టులతోపాటు ప్రతీ వ్యాపారంలో ఎస్సీలకు రిజర్వేషన్‌: సీఎం

ధనిక పారిశ్రామికవేత్తల వల్లే.. ఎస్సీలు కూడా వ్యాపారంలో రాణించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని సీఎం తెలిపారు. దళిత వాడలు బంగారు మేడలైతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ పనిలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.

cm kcr
cm kcr

By

Published : Aug 16, 2021, 3:43 PM IST

Updated : Aug 16, 2021, 4:29 PM IST

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. లైసెన్సింగ్‌ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని వెల్లడించారు.

ఎరువుల దుకాణాలు, మందుల దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ధనిక పారిశ్రామికవేత్తల వల్లే ఎస్సీలు కూడా వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని సీఎం తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ దళిత బంధుపై చర్చ జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే ఇదో మహోన్నత ఉద్యమం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గవర్నమెంట్‌ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుబంధు తరహాలోనే ఎస్సీ బంధు అమలు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో దళితబంధు ఇస్తామన్నారు. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధు నిధులు ఇస్తామన్నారు.

ఎస్సీల పట్ల వివక్ష ఇంకా ఎన్ని దశాబ్దాలు కొనసాగుతుందని సీఎం కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలవాలవాలని ఆకాంక్షించారు. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. దళితబంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చని సూచించారు. దళిత బంధు డబ్బు 100 శాతం సబ్సిడీతో ఇస్తామన్నారు. దళిత బంధు నిధులకు కిస్తీల కిరికిరి లేదని స్పష్టం చేశారు.

Last Updated : Aug 16, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details