కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ కుమారుడికి తారకరామారావుగా... సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టరేట్లో దళితబంధుపై సమావేశం నిర్వహించారు. అనంతరం తమ బిడ్డకు సీఎం కేసీఆర్‌తో పేరు పెట్టించాలని ఎంపీపీ దంపతులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను కోరడంతో... ఆయన ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నారిని ఎత్తుకుని ఆ బాలుడికి తారకరామారావుగా నామకరణం చేశారు.
ఎంపీపీ కుమారుడికి కేటీఆర్‌గా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ - తెలంగాణ తాజా వార్తలు
రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ దంపతుల కుమారుడికి సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. చిన్నారికి తారకరామారావుగా పేరు పెట్టారు.
![ఎంపీపీ కుమారుడికి కేటీఆర్‌గా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ CM KCR named TRS MPP son](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12894223-656-12894223-1630073737758.jpg)
CM KCR named TRS MPP sonCM KCR named TRS MPP son
బాలుడి తల్లిదండ్రులు ఇంటిపేరు కలిగేటి కావడంతో ఆ చిన్నారి పేరు కలిగేటి తారకరామారావు అయింది. అంటే సంక్షిప్తంగా కేటీఆర్ వచ్చేలా ఉంది. తమ బిడ్డకు ముఖ్యమంత్రి నామకరణం చేయడం పట్ల చిన్నరి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:CM KCR: వినోద్‌కుమార్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్