రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల డోసులు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.66 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
అత్యవసరంగా 30 లక్షల టీకాలు పంపాలని కేంద్రానికి సీఎస్ లేఖ - hyderabad updates
రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల డోసులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ప్రస్తుతం 5.66 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
నిత్యం లక్షకుపైగా టీకాలు వేస్తున్నామని.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు కేవలం మూడు రోజులకు మాత్రమే సరిపోతాయని లేఖలో సీఎస్ వివరించారు. కరోనా కట్టడికి అత్యవసరంగా టీకాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు.