తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2022, 7:08 AM IST

ETV Bharat / city

CBI on YS Viveka Murder : 'వైఎస్ వివేకాను కొట్టి.. ఆ లెటర్ రాయించారు'

CBI on YS Viveka Murder : మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వై.ఎస్. వివేకా హత్యకు గురైనప్పుడు... ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ ... ఆయన్ని కొడుతూ... ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వివరించింది . అందుకే చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది.

YS Viveka Murder Case
YS Viveka Murder Case

YS Viveka Murder Case Updates : మాజీ మంత్రి వై.ఎస్ . వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ ... ఆయన్ని కొడుతూ... ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వివరించింది. అందుకే చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సు ప్రయోగశాలలో ఫోరెన్సిక్ సైకలాజికల్ విశ్లేషణ (ఎలాంటి పరిస్థితుల్లో లేఖ రాశారో తెలుసుకోవడానికి) చేయించిన సీబీఐ అధికారులు ఆ సంస్థ నుంచి నివేదిక తీసుకున్నారు. ఈ కేసులో ఇటీవల దాఖలుచేసిన అభియోగపత్రంతో పాటు ఆ నివేదికనూ న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది. వాటిల్లోని ప్రధానాంశాలివే!

పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదు..

Viveka Murder Case Forensic Report : లేఖలోని చేతిరాతను విశ్లేషిస్తే ... రాసినప్పుడు పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదని రిపోర్ట్​లో తేలిందన్నారు. రాసిన వ్యక్తి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదని... తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్య రాసినట్లు ఉందన్నారు. చేతులు వణుకుతుండగా రాసినట్లు కనిపిస్తోందని... అక్షరాలు క్రమపద్ధతిలో లేవని పేర్కొన్నారు. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కోచోట ఒక్కోలా ఉందన్నారు. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని... అక్షరాల పరిమాణం అంతా ఒకేలా లేదని తెలిపారు. అక్షరాలు కొన్నిచోట్ల చిన్నవిగా , మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయి.

సంతకంతో వైఎస్ లేదు..

CBI inquiry on Vivka Murder Case : వివేకానందరెడ్డి అసలైన సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉందని నివేదికలో తేలిందన్నారు. ఆయన తన సంతకంలో తొలుత ఇంటిపేరు చేర్చి వై.ఎస్.వివేకానందరెడ్డి అని పెడతారు. కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే అదీ అస్పష్టంగా ఉందన్నారు. స్పృహ లేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని .. ఆ లేఖ రాసినప్పుడు ఆయన స్వేచ్ఛగా లేరన్నారు . ఆందోళ , ఒత్తిడి మధ్య ఉన్నారని... లేఖ అసంపూర్తిగా ఉందని తెలిపారు.

అసలు ఆ లేఖలో ఏం ఉందంటే..

అసలు ఆ లేఖలో ఏం ఉందంటే..

వివేకా హత్యకు గురైన రోజున ( 2019 మార్చి 15 న ) ఆయన మృతదేహం వద్ద ఓ లేఖ లభించింది. అది ఆయనే రాశారని ప్రచారం జరిగింది. అదే రోజు సాయంత్రం కుటుంబసభ్యులు దాన్ని పోలీసులకు అందజేశారు. అందులో ఏముందంటే "నా డ్రైవర్​ను నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడు. ఈ లేఖ రాయటానికి చాలా కష్టమైంది. డ్రైవర్ ప్రసాద్​ను వదిలిపెట్టొద్దు. ఇట్లు వివేకానందరెడ్డి" అని ఆ లేఖలో ఉంది. సీబీఐ అధికారులు వీటిని న్యాయస్థానానికి సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details