తెలంగాణ

telangana

ETV Bharat / city

Huzurabad By Election 2021 : ఉపఎన్నిక నిష్పక్షపాతంగా జరగాలంటే.. కలెక్టర్, ఎస్పీని బదిలీ చేయండి

హుజూరాబాద్​(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. ఉపఎన్నిక(Huzurabad By Election 2021) నిష్పక్షపాతంగా జరగాలంటే వారందర్ని బదిలీ చేయాలని కోరారు.

Huzurabad By Election 2021
Huzurabad By Election 2021

By

Published : Oct 8, 2021, 9:19 AM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి.. రాష్ట్ర ఎన్నికల అధికారి(Telangana Election Officer)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజూరాబాద్ నియోజకవర్గ(Huzurabad By Election 2021) ఇంఛార్జ్, రిటర్నింగ్ ఆఫీసర్ వంటి అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుత అధికారులు ఇతర పార్టీ అభ్యర్థులకు అన్ని రకాలుగా ఇబ్బందులను కలిగిస్తున్నారని ఈసీ(Telangana Election Officer)కి వివరించారు. అర్హులైన కుటుంబాలకు దళితబంధు పంపిణీచేయడం లేదని చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి పోలింగ్​కు మూడు లేదా నాలుగు రోజులు ముందు అర్హులైన కుటుంబాల ఖాతాల్లో దళితబంధు నిధులను జమచేయడానికే వాటిని నిలిపివేసిందని ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details