మై విలేజ్ షో ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ కరీంనగర్‌లో సందడి చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని శ్రీ మహాశక్తి అమ్మవారిని గంగవ్వ బుధవారం దర్శించుకున్నారు. మహాశక్తి ఆలయానికి చేరుకున్న గంగమ్మకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. గంగవ్వను చూసేందుకు అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.
కరీంనగర్‌లో గంగవ్వ సందడి.. సెల్ఫీల కోసం యువత పోటీ - కరీంనగర్‌లో గంగవ్వ
శరన్నవరాత్రులను పురస్కరించుకుని కరీంనగర్ మహాశక్తి ఆలయాన్ని యూట్యూబ్ స్టార్ గంగవ్వ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన గంగవ్వకు ఎంపీ బండిసంజయ్ ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
![కరీంనగర్‌లో గంగవ్వ సందడి.. సెల్ఫీల కోసం యువత పోటీ కరీంనగర్‌లో సందడి చేసిన గంగవ్వ..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9270704-885-9270704-1603362857134.jpg)
కరీంనగర్‌లో సందడి చేసిన గంగవ్వ..
యూట్యూబ్‌లో మై విలేజ్ షో ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గంగవ్వను ఎంపీ బండి సంజయ్ కుమార్ శాలువాతో సత్కరించారు.
కరీంనగర్‌లో సందడి చేసిన గంగవ్వ..