కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు రెండు ఎలుగుబంట్లు పడ్డాయి. సోమవారం తెల్లవారుజామున అరుపులు రావడం గమనించిన గ్రామస్థులు బావిలో చూసేసరికి భల్లూకాలు కనిపించాయి.
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన భల్లూకాలు - bear fell into the farm well in Karimnagar
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో రెండు ఎలుగుబంట్లు పడిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రే అటవీ అధికారులకు సమాచారం అందించినా ఇప్పటికీ వారి జాడలేదు.
వ్యవసాయ బావిలో పడిన ఎలుగు బంట్లు
వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రే ఎలుగుబంట్లు బావిలో పడి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. రాత్రి నుంచి భల్లూకాలు నీటిలోనే ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు.