Bear Wanders in Jagtial: కరీంనగర్ శివారు ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రానైట్ మార్బుల్ దుకాణంలో ఎలుగు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల ప్రాంతంలో ఎలుగుబంటి తిరిగిన చిత్రాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
కరీంనగర్ సమీపంలో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో ప్రజలు.. - కరీంనగర్ సమీపంలో ఎలుగు కలకలం
Bear Wanders in Jagtial: కరీంనగర్ సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. జగిత్యాల ప్రధాన రహదారి పక్కన గ్రానైట్ మార్బుల్ దుకాణంలో ఎలుగు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. జనావాసాల్లోకి భల్లూకాలు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
bear
ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో ప్రత్యక్షమైన ఎలుగుబంటి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. తాజాగా మళ్లీ ప్రత్యక్షమవటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. పట్టణ శివారులో ఉన్న గ్రానైట్స్ నిల్వలు తరిగిపోతుండటంతోనే భల్లూకాలు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jul 30, 2022, 12:42 PM IST